Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భోళాశంకరుడిని అనుకుంటున్నారేమో... రౌద్రశంకరుడిని కూడా!: తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం

తెలంగాణ డిప్యూటీ సీఎంగా పనిచేస్తూ బర్తరఫ్ కు గురైన తాటికొండ రాజయ్య మహాశివరాత్రి సందర్భంగా రౌద్రావతారం ఎత్తారు. తన నియోజకవర్గం స్టేషన్ ఘనపూర్ లో ఏ ఒక్కరు వేలు పెట్టినా రౌద్ర శంకరుడినవుతానని హెచ్చరించారు. డిప్యూటీ సీఎం పదవి కోల్పోయిన నాటి నుంచి అభద్రతాభావంలోకి వెళ్లిపోయిన ఆయన ఇదివరకే ఈ తరహా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదివరకటి వ్యాఖ్యలకు కాస్త మసాలా జోడించి రౌద్రావతారం ఎత్తారు. ‘‘నన్ను అందరూ భోళా శంకరుడినని అనుకుంటారు. నా నియోజకవర్గంలో వేలు పెడితే రౌద్రశంకరుడిగానూ మారాల్సి వస్తుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

More Telugu News